ఎయిర్‌టెల్‌, జియో బాట‌లో వొడాఫోన్‌.. 98 రూపాయ‌ల‌కే 12జీబీ డేటా 

టెలికం కంపెనీల మ‌ధ్య డేటా వార్ కంటిన్యూ అవుతోంది. డ‌బుల్ డేటా ఆఫ‌ర్ల‌తో జియో, ఎయిర్‌టెల్ క‌స్ట‌మ‌ర్ల‌ను ఆకర్షించాల‌ని ప్లాన్ చేసిన వొడాఫోన్ ఇప్పుడు 98 రూపాయ‌ల డేటా ప్యాక్‌లో ఆ రెండు కంపెనీల‌నే ఫాలో అయిపోయింది.   ఈ ప్యాక్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఇస్తున్న డేటాను డ‌బుల్ చేసింది.

ఇవీ ప్లాన్ డిటెయిల్స్‌
* 98 రూపాయ‌లు పే చేస్తే ఇంత‌కు ముందు 6జీబీ హై స్పీడ్ డేటా ఇచ్చేది. ఇప్పుడు దాన్ని 12 జీబీకి పెంచింది.

* అయితే దీనిలో డేటా ఒక్క‌టే ఉంటుంది. ఎలాంటి కాల్స్‌, ఎస్ఎంఎస్ సౌక‌ర్యాలు ఉండవు.

* వ్యాలిడిటీ 28 రోజులు.

* ఈ ప్యాక్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, క‌ర్నాట‌క, ఢిల్లీ, కేర‌ళ‌, ముంబాయి, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఈస్ట్ స‌ర్కిల్స్‌లో మాత్రమే ప్ర‌స్తుతం అందుబాటులో ఉంది. మిగ‌తా స‌ర్కిల్స్‌కు త్వ‌ర‌లో ఇవ్వ‌నుంది.  

ఎయిర్‌టెల్‌, జియోల మాదిరిగానే
ఎయిర్‌టెల్‌, జియోల్లో 98 రూపాయ‌ల‌కు 12జీబీ  హైస్పీడ్ డేటా ప్లాన్ ఇప్ప‌టికే అందుబాటులో ఉంది. ఇప్పుడు వొడాఫోన్ ఐడియా కూడా దీన్ని ఫాలో అయింది. 

Vodafone double data plans వొడాఫోన్‌ 98 రూపాయ‌ల‌కే 12జీబీ డేటాÂ